తమన్నా ఖామోషీ ట్రైలర్‌ విడుదల


మిల్కీ బ్యూటీ తమన్నా, ప్రభుదేవా ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ఖామోషీ. ఈ చిత్రానికి చక్రి తోలేటి దర్శకత్వంతో రూపొందించిన ఈ సినిమాలో సమీర్‌ టాండన్‌, సత్య మానిక్‌ అఫ్సర్‌ బాణీలు అందించారు. భూమిక, సంజయ్‌ సూరి, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని పీవైఎక్స్‌ సంస్థ నిర్మించింది. యువన్‌ శంకర్‌ రాజా బాణీలు అందించారు. ఇందులో ప్రభాస్‌ అతిథిగా కనిపించనున్నారట. 2017లోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైనా కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది.ఇటీవల ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన చిత్ర బృందం బుధవారం ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ప్రభుదేవా సైకో కిల్లర్‌ పాత్రలో నటించినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. మే 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.