HomeTelugu Trendingతమిళ హాస్య నటుడు తవసి కన్నుమూత

తమిళ హాస్య నటుడు తవసి కన్నుమూత

Tamil actor thavasi passes
తమిళ హాస్య నటుడు తవసి గత కొంత కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతూ నిన్న సాయంత్రం కన్నుమూశారు. తవసి క్యాన్సర్ చికిత్సకు ఆర్థిక సాయం చేయాలంటూ తవసి కుమారుడు అరుముగన్ ఓ వీడియోను విడుదల చేసి వేడుకొనగా… ఆర్థికంగా ఆదుకునేందుకు తమిళ స్టార్‌ హీరోలు విజయ్‌ సేతుపతి, శివకార్తికేయన్‌, సూరిలతో పాటు మరికొంత మంది పరిశ్రమ పెద్దలు మేము సైతం అంటూ ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన కన్నుమూయడం దురదృష్టకరం. ఆయన మృతికి తమిళ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ‘సువరాపాండియన్’, ‘వరుతాపాధ వాలిబార్ సంగం’, ‘రజిని మురుగన్’ సినిమాలు తవసికి మంచి గుర్తింపునిచ్చాయి. తవసి రజనీకాంత్ తాజా చిత్రం అన్నాత్తేలో కూడా నటించినట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu