భార్యను చంపి ముక్కలుగా నరికిన సినీ దర్మకుడు.!


తమిళ సినీ దర్శకుడు దారుణానికి పాల్పడ్డాడు. భార్యను చంపి ముక్కలుగా నరికాడు. వివరాల్లోకి వెళితే ‘కాదల్ ఇలవశం’ సినిమాతో తమిళ పరిశ్రమకు దర్శకుడిగా పరిచయయ్యాడు బాలకృష్ణన్. ప్రేమించిన సంధ్యను వివాహం చేసుకుని సినిమాలపై ఇష్టంతో చెన్నై వచ్చాడు. సంధ్య కూడా సినీ సహాయ నటిగా కొనసాగుతోంది. హీరోయిన్ కావాలనుకున్న ఆమె పలువురు ప్రముఖులతో సన్నిహితంగా ఉండేది.

దీంతో అనుమానం పెంచుకున్న బాలకృష్ణన్ కోపంతో సంధ్యను చంపి ముక్కలుగా నరికి శరీర భాగాలను వేరు వేరు ప్రాంతాల్లో పడేశాడు. వాటి ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు మృతురాలు సంధ్య అని గుర్తించి, భర్తే ఆమెను అనుమానంతో చంపినట్టు నిర్థారించారు.