HomeTelugu Newsవాలెంటైన్స్ డే సందర్భంగా నాగచైతన్య స్పెషల్‌ వీడియో.. వైరల్‌

వాలెంటైన్స్ డే సందర్భంగా నాగచైతన్య స్పెషల్‌ వీడియో.. వైరల్‌

Naga Chaitanya shared Valen
అక్కినేని నాగచైతన్య వాలెంటైన్స్ డే సందర్బంగా ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ప్రస్తుతం నాగచైతన్య- సాయిపల్లవి హీరోహీరోయిన్‌లుగా తండేల్‌ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు లవర్స్ డే సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశాడు.

తండేల్ గ్లింప్స్ లోని పాపులర్ డైలాగుతో చైతన్య- సాయిపల్లవి ఈ వీడియో చేశారు. ఈ గ్లింప్స్ చివర్లో చైతన్య డైలాగ్ బాగా పాపులర్ అయింది. “బుజ్జితల్లీ.. వచ్చేత్తున్నా కదే.. కాస్త నవ్వే” అనే డైలాగ్ ను ఈ తాజా వీడియోలో చైతన్య చెప్పాడు. దీనికి ఆ మూవీ గ్లింప్స్ లోలాగే సాయి పల్లవి నవ్వుతూ కనిపించింది. నిజానికి ఇద్దరూ ఒక్కో చోట ఉంటూ ఈ వీడియోను చేయడం విశేషం. దీనిని షేర్ చేస్తూ అతడు వాలెంటైన్స్ డే విషెస్ చెప్పాడు.

తండేల్ మూవీలో నాగ చైతన్య తొలిసారి ఓ మత్స్యకారుడి కనిపించనున్నాడు. 2018లో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని మత్స్యకారులు గుజరాత్ తీరంలో చేపల వేటకు వెళ్లగా వాళ్లను పాకిస్థాన్ కోస్ట్ గార్డ్ బంధించి తమ దేశానికి తీసుకెళ్తుంది.

వాళ్లను సుమారు రెండేళ్ల పాటు అక్కడి జైల్లలో ఉంచుతుంది. ఈ ఘటనల ఆధారంగానే తండేల్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు చందూ మొండేటి. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. తండేల్ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్‌ కాలేదు.

 

View this post on Instagram

 

A post shared by Chay Akkineni (@chayakkineni)

Recent Articles English

Gallery

Recent Articles Telugu