గోపీచంద్‌తో తొలిసారి జతకట్టనున్న హీరోయిన్‌!

టాలీవుడ్ పరిశ్రమలోకి విలన్‌గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న యజ్ఞం హీరో గోపీచంద్ ఆ తరువాత అనేక మాస్ సినిమాలు చేశాడు. సాహసం సినిమా తరువాత పెద్దగా హిట్స్ లేకపోవడం బాధాకరమైన విషయమే. ఇటీవల కాలంలో వచ్చిన జిల్ సినిమా ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటె తాజాగా బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో గోపీచంద్ ఓ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాకి బిను సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను తీసుకున్నారని సమాచారం. కాజల్ అగర్వాల్ యువ, సీనియర్ హీరోలందరి సినిమాల్లో నటించింది. ఒక్క గోపీచంద్ తో తప్పా. అది ఇప్పుడు ఇలా వర్కౌట్ అయిందన్నమాట. జూన్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది.