HomeTelugu Trendingకొత్త రూటు ఎంచుకున్న నటి తాప్సీ

కొత్త రూటు ఎంచుకున్న నటి తాప్సీ

Tapsee Pannu as producer

టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్‌లో సక్సెస్ సాధించిన నటి తాప్సీ. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దం పూర్తయింది. ఇన్నాళ్లూ నటిగా ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కొత్త రూట్ ఎంచుకుంది. అదేమిటంటే తాను ఇప్పుడు నిర్మాతగా మారబోతుంది. ఔట్‌సైడర్ ఫిల్మ్‌ పేరుతో ప్రొడక్షన్స్ హౌస్ స్టార్ట్ చేస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది తాప్సీ. నా జీవితంలో ఇదొక కొత్త అనుభవం. కచ్చితంగా నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా.. ఇప్పుడు నా కల నెరవేరింది. ఈ ప్రయాణంోల ఎలా నెగ్గుకు రావాలో నేర్చుకున్నా. పబ్లిక్ ఫిగర్ అవుతానని ఊహించలేదు. నాపై ప్రేమాభిమానం చూపించిన అందరికీ రుణపడి ఉంటాను, నా స్నేహితుడు ప్రాంజల్‌తో కలిసి ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టా. మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ తన ప్రొడక్షన్‌ హౌస్‌ గురించి ప్రకటించింది. నిర్మాతగా తన తొలి చిత్రం జీ స్టూడియోతో కలిసి ‘బ్లర్‌’ నిర్మిస్తున్నట్లు తెలిపింది. ఈ చిత్రానికి అజయ్ బాల్ దర్శకుడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu