HomeTelugu Trendingతాప్సీ పన్ను 'దోబారా' ట్రైలర్ రిలీజ్

తాప్సీ పన్ను ‘దోబారా’ ట్రైలర్ రిలీజ్

Tapsee Dobaaraa trailer

వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ బాలీవుడ్‌లో తాప్సీ పన్ను దూసుకెళ్తోంది. ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలతో తాప్సీ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం ”దో బారా” (2:12) అనే మర్డర్ మిస్టరీ డ్రామాలో నటిస్తోంది. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్ట్ 19న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాను శోభా కపూర్, ఏక్తా కపూర్, సునీత్ ఖేత్రపాల్, గౌరవ్ బోస్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది.

26 ఏళ్ల క్రితం పెద్ద పిడుగుపాటు కారణంగా మరణించిన ఒక చిన్న పిల్లాడు.. అలాంటి ఉరుముల వల్ల ఓ టీవీ ద్వారా తాప్సికి కనెక్ట్ అవ్వడం ట్రైలర్‌లో తెలుస్తోంది. ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ రేపుతోంది. హారర్ చిత్రంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో తాప్సితో పాటు నాజర్, పవలి గులాటి, రాహుల్ భట్ తదితరులు నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu