HomeTelugu Trending'గాడ్సే' ట్రైలర్‌ వచ్చేసింది..

‘గాడ్సే’ ట్రైలర్‌ వచ్చేసింది..

Godse Official Trailer

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సత్యదేవ్‌ నటించిన తాజా చిత్రం ‘గాడ్సే’. ఈ చిత్రానికి గోపి గణేష్‌ పట్టాభి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాను సీకే స్క్రీన్స్ బ్యాన‌ర్ పై సీ కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మ‌ల‌యాళ న‌టి ఐశ్వర్య ల‌క్ష్మి మొద‌టి సారి తెలుగు లో హీరోయిన్ గా న‌టిస్తుంది. తాజాగా ఈమూవీ ట్రైలర్‌ని రిలీజ్‌ చేసింది మూవీ యూనిట్‌.

అవినీతిమయమైన రాజకీయ నాయకులను, వ్యవస్థను ఒంటి చేత్తో ధైర్యవంతుడి పాత్రలో సత్యదేవ్‌ నటించినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతంది. ‘పథకాల రూపంలో కేంద్రం నుంచి వచ్చింది ఎంత? అప్పుల రూపంలో ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చింది ఎంత? గ్రౌండ్ రియాలిటీలో ఖర్చు పెట్టింది ఎంత? సూట్ కేసు కంపెనీలకు తరలించినది ఎంత?’ ‘ప్రశ్నిస్తే… మారణకాండ చేసేస్తారా?, ‘అర్హత ఉన్నోడే అసెంబ్లీలో ఉండాలి. పద్దతి ఉన్నోడో పార్లమెంట్‌లో ఉండాలి. మర్యాద ఉన్నోడే మేయర్‌ కావాలి.. సబ్జెక్ట్‌ ఉన్నో సర్పంచ్‌ కావాలి’, ‘సుజలాం సుఫలం మలయజ శీతలం’ లాంటి పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌తో ట్రైలర్‌ అదిరిపోయింది. జూన్‌17న ఈ చిత్రం విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu