‘ఎన్టీఆర్’ ఆడియో వేడుకకు జూ.ఎన్టీఆర్!

నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’. ఈ సినిమా యొక్క ఆడియో వేడుక రేపు భారీ ఎత్తున జరగనుంది. ఈ వేడుక కి జూ.ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడట. అంతేకాదు అలనాటి స్టార్ హీరో,హీరోయిన్‌లు కృష్ణ, కృష్ణంరాజు, జామున, మోహన్ బాబు మరియు ఇంకొందరు కూడ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేయనున్నారు. మొత్తం రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాలోని మొదటి పార్ట్ జనవరి 9న, 2వ పార్ట్ ఫిబ్రవరి 7న రిలీజ్ కానున్నాయి.