‘రంగస్థలం’లో బైక్ ఛేజింగ్!

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. చరణ్ ఈ సినిమాలో విలేజ్ కుర్రాడిగా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్ర షూటింగ్ కి సంబందించిన ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. రంగస్థలంలో ఇటీవలే అత్యంత ఉత్కంఠ రేకెత్తించే బైక్ ఛేగింగ్ సన్నివేశాలని చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

రంగస్థలం లాంటి సినిమాలో బైక్ ఛేజింగ్ సన్నివేశాలు ఉండడమే ఒకింత ఆశ్చర్యం. అలాంటిది వాటిని ఉత్కంఠ భరితంగా చిత్రీకరించారట. ఆ సన్నివేశాలు అభిమానులని థ్రిల్ చేయస్తాయని చెబుతున్నారు. పుర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బైక్ సీన్స్ ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.