అలీని అభ్యర్థిగా ప్రకటిస్తే ఆ సీటులో ఓటమి తప్పదు: టీడీపీ

సినీ నటుడు అలీని తాము తిరస్కరించాకే జగన్ పంచన చేరారని టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్‌ మీరా తెలిపారు. అలీని అభ్యర్థిగా ప్రకటిస్తే ఆ సీటులో ఓటమి తప్పదని మా సర్వేలో తేలిందని.. అందుకే ఆయనకి నో చెప్పామని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో ముస్లిం మైనార్టీ ఓటు ఒక్కటి కూడా వైసీపీకి పడదన్నారు. టీడీపీతో గుర్తింపు పొందిన కొందరు నేతలు పార్టీలు మారుతూ వికృత రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో జగన్‌ సమక్షంలో సినీ నటుడు అలీ వైసీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. గుంటూరు తూర్పు నుంచి టీడీపీ తరఫున అలీ పోటీ చేస్తారని తొలుత ప్రచారం జరిగింది. అయితే టీడీపీ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో తాను పార్టీ మారినట్లు అలీ మీడియాకు వెల్లడించారు.