వైసీపీలో చేరిన దేవినేని అవినాష్‌

యువనేత దేవినేని అవినాష్‌ వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్‌ అవినాష్‌కు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీనియర్‌ నేత కడియాల బుచ్చిబాబుతో పాటు పలువురు నేతలు అవినాష్‌తో పాటు వైసీపీలో చేరిన వారిలో ఉన్నారు. రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ ఈ మధ్యాహ్నమే టీడీపీకు అవినాష్‌ రాజీనామా చేశారు. తన తండ్రి దేనినేని నెహ్రూ అభిమానుల ఒత్తిడి మేరకు ఆయన వైసీనీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ను కలిసి వైసీపీలో చేరారు.

జగన్‌తో భేటీ అనంతరం అవినాష్‌ మీడియాతో మాట్లాడుతూ… గత 40 ఏళ్లుగా దేవినేని నెహ్రూను నమ్ముకుని పనిచేస్తున్న కార్యకర్తల కోసమే పార్టీ మారాల్సి వచ్చిందని తెలిపారు. చంద్రబాబుపై ఎప్పటికీ అభిమానం ఉంటుందని, ఇన్నాళ్లూ ఆదరించిన ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

CLICK HERE!! For the aha Latest Updates