HomeTelugu Trending'తీస్ మార్ ఖాన్' మూవీ అప్డేట్‌

‘తీస్ మార్ ఖాన్’ మూవీ అప్డేట్‌

Tees maar khan movie big an

ఆది సాయికుమార్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. క‌ళ్యాణ్ జీ గోగ‌న డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా నుండి ఇటీవ‌లే విడుద‌లైన టీజ‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. యాక్ష‌న్ ఎంటర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని జూలై 27న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ఇటీవ‌లే ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ వ‌రుస అప్‌డేట్‌ల‌ను ప్ర‌క‌టిస్తూ ప్రేక్ష‌కుల‌లో ఆస‌క్తిని పెంచేస్తున్నారు.

తాజాగా చిత్ర‌బృందం మ‌రో అప్‌డేట్‌ను ప్ర‌క‌టించింది. ఈ చిత్రానికి సంబంధించిన బిగ్ అనౌన్స్‌మెంట్‌ను శుక్ర‌వారం సాయంత్రం 5.04 నిమిషాల‌కు వెల్ల‌డించ‌నున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు. పాయ‌ల్ రాజ్‌పుత్ ఈసినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. విజ‌య్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తిరెడ్డి నిర్మించాడు. సునీల్‌, పూర్ణ‌, క‌బీర్ దుహ‌న్ సింగ్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రంలో ఆది మూడు విభిన్న పాత్ర‌ల్లో న‌టించ‌నున్నాడు. ఒక‌టి స్టూడెంట్ పాత్ర కాగా మ‌రోక‌టి రౌడి పాత్ర‌.. ఇంకోటీ పోలీస్ పాత్ర‌. ఇలా మూడు డిఫ‌రెంట్ క్యారెక్ట‌రైజేష‌న్స్‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్టైన్ చేయ‌డానికి సిద్ధ‌మైయ్యాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu