HomeTelugu Trending'హనుమాన్‌'గా తేజ స‌జ్జా!

‘హనుమాన్‌’గా తేజ స‌జ్జా!

Teja sajja in

ప్ర‌శాంత్ వ‌ర్మ‌ ఇటీవలే ‘హనుమాన్‌’ అనే సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. మ‌న పురాణాల్లో సూప‌ర్ మాన్… హ‌నుమాన్‌. హాలీవుడ్ లో సూప‌ర్ హీరోల క‌థ‌ల‌కు ఓర‌కంగా హ‌నుమాన్ నే స్ఫూర్తి. అందుకే హ‌నుమాన్ తోనే తెలుగులో తొలి సూప‌ర్ హీరో సినిమా తీస్తానంటున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. అయితే హీరో ఎవ‌ర‌న్న‌ది ప్రకటించలేదు. అయితే ఆ ఛాన్స్‌… తేజ స‌జ్జాకి దొరికింద‌ని తెలుస్తోంది. ప్ర‌శాంత్ వ‌ర్మ ‘జాంబిరెడ్డి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు‌. అంత‌కు ముందు సమంత ‘ఓ బేబీ’ సినిమాలో ఓకీల‌క‌మైన పాత్ర‌లో నటించాడు. ఇప్పుడు మ‌రోసారి.. ప్ర‌శాంత్ వ‌ర్మ తో సినిమాలో నటించినున్నాడు. ‘హ‌నుమాన్’ ఓ సైన్స్ ఫిక్ష‌న్ అని తెలుస్తోంది. అందులో హ‌నుమంతుడి క‌థ‌ని తెలివిగా మిక్స్ చేస్తున్నాడ‌ట‌. ఈ సినిమాలో విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉంద‌ని, మిగిలిన భాష‌ల్లోనూ ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని చూస్తున్నార‌ని తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu