మోడీకి 16 అంశాలపై కేసీఆర్‌ వినతి

ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ ముగిసింది. ఢిల్లీలోని 7 లోక కళ్యాణ్‌ మార్గ్‌లో ప్రధాని నివాసంలో సుమారు 40 నిమిషాల పాటు వీరిద్దరి భేటీ కొనసాగింది. పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని ఈ సందర్భంగా ప్రధానిని కేసీఆర్‌ కోరారు. దీంతో పాటు పలు రాజకీయ అంశాలపైనా ఇద్దరు నేతలు చర్చించినట్టు సమాచారం. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టించిన తర్వాత రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలుసుకున్నారు. ఈ భేటీలో ప్రధానికి సుమారు 16 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని కేసీఆర్‌ అందజేసినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఆ 16 అంశాలు ఇవే..

1) సచివాలయం నిర్మాణానికి బైసన్పోలో గ్రౌండ్ అప్పగించాలని విజ్ఞప్తి
2) కరీంనగర్ లో త్రిబుల్ ఐటీ ఏర్పాటు
3) హైదరాబాదులో ఐఐఎం ఏర్పాటు
4) నూతన జిల్లాలలో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు
5) హైదరాబాదులో ఐఐఎస్ఈఆర్ ఏర్పాటు
6) ఆదిలాబాదులో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరణ
7) జహీరాబాద్లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మనుఫ్యాక్టర్యింగ్ జోన్ ఏర్పాటు
8) వరంగల్ లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు వెయ్యి కోట్లు మంజూరు చేయాలి
9) కృష్ణా నదీ జలాల పంపిణీపై తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్లను ట్రిబ్యునల్కు కేంద్ర ప్రభుత్వం రిఫర్ చేయాలి
10) కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం లేదా ప్రత్యేక సాయం ప్రత్యేక సాయం అందించాలని విజ్ఞప్తి
11) విభజన చట్టంలోని 9,10 షెడ్యూల్ లోని సంస్థలను వెంటనే విభజించాలి
12) రైల్వే ప్రాజెక్టులకు వెంటనే నిధులు కేటాయించాలి
13) SC వర్గీకరణ చేపట్టాలి
14) వరంగల్లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి
15) వెనకబడిన జిల్లాలకు 650 కోట్ల రూపాయల నిధులు విభజన చట్టం ప్రకారం ఇవ్వాలి
16) ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద తెలంగాణకు నిధులు కేటాయించాలిల చేయాలి.