HomeTelugu Trendingపుష్ప: తెలంగాణలో ఐదో షోకు ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్‌

పుష్ప: తెలంగాణలో ఐదో షోకు ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్‌

pushpa1

తెలంగాణలోని ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌కు శుభవార్త. సుకుమార్‌ డైరెక్షన్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తెలంగాణలో ఐదో షోకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్‌లలో ‘పుష్ప’ ఐదు షోలు వేయనున్నారు.

pushpa 1

డిసెంబ‌ర్ 17 వ తేదీ నుంచి… ఈ నెల‌ 30 వ తేదీ వ‌ర‌కు అంటే.. దాదాపు రెండు వారాల పాటు పుష్ప సినిమా 5 వ షోకు అనుమ‌తి ఇచ్చింది. ఇప్పటికే సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్‌ లభించింది. ‘పుష్ప’ రన్‌ టైమ్‌ 179.51 నిమిషాలు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. స్టార్‌ హీరోయిన్‌ సమంత ఐటమ్‌ సాంగ్‌ చేసింది. యాంకర్‌ అనసూయ, సునీల్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu