HomeTelugu Newsతెలంగాణలో ముగిసిన ఆర్టీసీ కార్మికుల సమ్మె

తెలంగాణలో ముగిసిన ఆర్టీసీ కార్మికుల సమ్మె

11 18
తెలంగాణలో 52 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు విరమిస్తున్నట్లు ప్రకటించారు. రేపటి నుంచి విధులకు హజరుకాబోతున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఆర్టీసీ సమ్మెను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించిన కార్మిక సంఘాలు వెనక్కి తగ్గి సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటన చేశాయి. ఈ మేరకు ఆర్టీసీ జేఏసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా తాము సమ్మె విరమిస్తున్నామని రేపటి నుండి విధుల్లో చేరతామని వెల్లడించారు. కార్మికుల శ్రేయస్సు కోసమే సమ్మె విరమించామని ఆర్టీసీ సమ్మె ద్వారా కార్మికులు నైతిక విజయం సాధించారని వారు తెలిపారు.

తప్పని పరిస్థితుల్లోనూ సమ్మె విరమిస్తున్నామని అయితే సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు జేఏసీ కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు. విధుల్లో చేరి ప్రభుత్వంపై తమ ఒత్తిడిని కొనసాగిస్తామని ఆర్టీసీ కాపాడేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వ్యాఖ్యానించారు. అయితే మొత్తం జేఏసీ 26 డిమాండ్స్ వినిపిస్తుండగా ప్రభుత్వం మాత్రం రెండే డిమాండ్స్ నెరవేర్చడానికి సిద్దంగా ఉంది. అయితే డిమాండ్లు నెరవేరకుండా సమ్మె విరమిస్తే ప్రభుత్వం మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటుందా? లేదా? అనే అనుమానం కార్మికులను వెంటాడుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu