HomeTelugu Big Storiesతెలుగు 'బిగ్‌బాస్‌-7' లోగో వచ్చేసింది

తెలుగు ‘బిగ్‌బాస్‌-7’ లోగో వచ్చేసింది

Telugu bigg boss 7 logo gli

బుల్లి తెరపై అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్‌బాస్’. తెలుగులో ఇప్పటికే ఆరు సీజన్‌లు పూర్తి చేసుకున్న ఎడో సీజన్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేక్షకులు కూడా ఈ షోపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాస్క్‌లు, గేమ్‌లు, ఛాలెంజెస్‌, వివాదాలు, వినోదం.. ఇలా అన్ని ఎలిమెంట్స్‌తో సాగుతూ అందరినీ టీవీలకు కట్టిపడేస్తుంది. తాజాగా గెట్‌ రెడీ అంటూ బిగ్‌ బాస్‌ సీజన్ 7 కూడా రాబోతుంది. స్టార్ మా, డిస్నీ+హట్‌ స్టార్‌లో సందడి చేయనుంది.

తాజాగా స్టార్‌ మా బిగ్ బాస్‌ తెలుగు సీజన్ 7 లోగోను విడుదల చేసింది. ఈ లోగో కలర్‌ఫుల్‌గా ఉంది. నీలం, ఎరుపు రంగుల సమ్మేళనంతో రూపొందించబడ్డ లోగో డిజైన్‌ ఇంటర్నేషనల్‌ ఫ్లేవర్‌ను జోడిస్తుంది, ఈ షో త్వరలో స్టార్‌ మా, డిస్నీ + హాట్‌స్టార్‌లో అందుబాటులోకి వస్తుంది. ఎక్జయిటింగ్‌ కౌంట్‌డౌన్ షురూ.. అని తెలియజేశారు మేకర్స్‌.

కాగా గత సీజన్‌లకు జూనియర్ ఎన్టీఆర్‌, అక్కినేని నాగార్జున, నాని సీజన్ల వారిగా హోస్టులుగా వ్యవహరించారు. అయితే ఈ సారి బిగ్ బాస్-7కు ఎవరు హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సారి హోస్ట్‌లు మారబోతున్నట్లు గతకొంతకాలంగా సోషల్‌ మీడియాలో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలసిందే. ఈక్రమంలో పలువురు స్టార్ల పేరు కూడా వినిపించాయి. ఇక కంటెస్టెంట్లు విషయంలో కూడా అంతే క్యూరియాసిటితో ఉన్నారు ఆడియన్స్‌. వీటిపై క్లారిటీ రావలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu