వెంకీ సినిమా టైటిల్ విన్నారా..?

తేజ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్, అనీల్ సుంకర కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నారు. అయితే ఈ సినిమాకు ఓ వెరైటీ టైటిల్ ను పెట్టినట్లు సమాచారం. ఈ మధ్య బాగా పాపులర్ అయిన పదం ‘ఈ నగరానికి ఏమైంది’. ప్రతి సినిమాకు ముందు పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అంటూ.. ఓ యాడ్ ను ప్రదర్శిస్తుంటారు.

ఆ యాడ్ లో ఈ పదం బాగా ఫేమస్ అయింది. ఇప్పుడు దీన్నే వెంకీ సినిమాకు టైటిల్ గా అనుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. పైగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. దీంతో వార్తలకు మరింత బలం చేకూరుతుంది. వచ్చే నెల 16 నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

అయితే ఇదే బ్యానర్ లో మరో రెండు చిన్న సినిమాలను కూడా చిత్రీకరిస్తున్నారు. కాబట్టి వెంకీ సినిమాకు ఈ టైటిల్ ను పెడతారనే గ్యారంటీ కూడా లేదు.. కానీ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం ఇది వెంకీ సినిమా కోసమే అని తెలుస్తోంది.