అఖిల్ సింగర్ గా మారిన వేల!

అక్కినేని వారసుడు అఖిల్ మంచి క్రికెటర్ అనే సంగతి చాలా మందికి తెలుసు. సెలబ్రిటీ లీగ్ లో తన సత్తా చూపించాడు ఈ యంగ్ హీరో. కుటుంబం అంతా సినిమా వాతావరణం కాబట్టి అఖిల్ కూడా క్రికెట్ ను పక్కన పెట్టి హీరో అయ్యాడు. అయితే ఇప్పుడు ఈ యంగ్ హీరో సింగర్ గారి ఓ పాట కూడా పాడాడు. అసలు విషయంలోకి వస్తే.. అబుదాబిలో సైమా అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో అక్కినేని అఖిల్ ఓ పాటను వినిపించాడు. అఖిల్ పాడుతునప్పుడు అంతా ఆశ్చర్యపోయి మరీ తిలకించారట.
అఖిల్ కు చిన్నప్పటినుండి కూడా తన తల్లి అమల పాటల్లో కొంతమేరకు శిక్షణ ఇప్పించింది. అఖిల్ పాటలు పాడతాడని నాగార్జున కూడా కొన్ని సంధర్భాల్లో వెల్లడించాడు. ఇప్పుడు తన కొడుకు స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇవ్వడంతో నాగార్జున తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అఖిల్ ఇలా పాడడం కోసం చాలా ప్రాక్టీస్ కూడా చేశాడని నాగార్జున అన్నారు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో విక్రమ్ కుమార్ దర్శకత్వం పూర్తిస్థాయి యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.