HomeTelugu Trendingపవన్‌ కల్యాణ్‌తో తెలుగమ్మాయి ఐటమ్‌ సాంగ్‌

పవన్‌ కల్యాణ్‌తో తెలుగమ్మాయి ఐటమ్‌ సాంగ్‌

10 2
పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఒక భారీ చారిత్రక చిత్రం రూపొందనుంది. ఆంగ్లేయుల కాలంలో పేదల కోసం దోపిడీలు చేసే పాత్రలో పవన్ కల్యాణ్ కనిపించనున్నాడు. ఇది రాబిన్ హుడ్ తరహాలో సాగుతుందట. ఈ సినిమాలో హఈరోయిన్‌గా కొంతమంది పేర్లను పరిశీలించారు. జాక్విలిన్ ను ఎంపిక చేశారనేది తాజా సమాచారం.

ఇక ఈ సినిమాలో మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసే ఐటమ్ సాంగ్ ఒకటి ఉంటుందట. అయితే ఈ సాంగ్‌ కోసం తెలుగు అమ్మాయి పూజిత పొన్నాడను తీసుకున్నారని తెలుస్తోంది. ‘కల్కి’ .. ‘రంగస్థలం’ సినిమాల్లో పూజిత పొన్నాడ సందడి చేసింది. ఆమెకు యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. పవన్ – క్రిష్ సినిమాలో ఆమె చేసే ఐటమ్ సాంగ్ తో మరింత పాపులర్ కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu