HomeTelugu Newsసూపర్‌ స్టార్‌ను కలిసిన విశాల్‌..

సూపర్‌ స్టార్‌ను కలిసిన విశాల్‌..

4 15తమిళనాడు నడిగర్ సంఘం అధ్యక్షుడు, నిర్మాత, హీరో విశాల్ ఈరోజు ఉదయం సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ ను కలిశారు. మరో నటుడు మనోబాలతో కలిసి రజినీకాంత్ ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఇళయరాజా 75 మ్యూజికల్ కార్యక్రమానికి రజినీకాంత్ ను ఆహ్వానించారు. అదే విధంగా పెట్ట మంచి విజయం సాధించడంతో.. ఈ ఇరువురు నటులు రజినీకాంత్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇళయరాజాకు 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఇళయరాజా 75 అనే కార్యక్రమాన్ని నడిగర్ సంఘం అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి తమిళ ప్రముఖులందరిని ఆహ్వానిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu