నితిన్ ‘లై’కు డేట్ ఫిక్స్ అయింది!

యూత్‌స్టార్‌ నితిన్‌ హీరోగా వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం ‘లై’ (లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎన్‌మిటి). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్ట్‌ 11న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నారు. 
చికాగోలో గ్రాండ్‌గా రిలీజ్‌ అయిన ఫస్ట్‌ సాంగ్‌ ‘బాంభాట్‌’ 
ఈ సందర్భంగా నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర మాట్లాడుతూ – ”చికాగోలో ఈ చిత్రం ఫస్ట్‌ సాంగ్‌ ‘బాంభాట్‌’ను చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేశాం. ఈ పాటకు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వస్తోంది. మణిశర్మ ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. 75 రోజులపాటు అమెరికాలోని వివిధ లొకేషన్లలో టాకీతోపాటు భారీ యాక్షన్‌ సీన్స్‌ షూట్‌ చెయ్యడం జరిగింది. దీంతో ఈ భారీ షెడ్యూల్‌ పూర్తయింది. మరో 10 రోజులపాటు హైదరాబాద్‌లో జరిగే షెడ్యూల్‌తో టోటల్‌గా షూటింగ్‌ పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్ట్‌ 11న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తాం. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘లై’ మా 14 రీల్స్‌ బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది” అన్నారు.