జయసుధ భర్త ఆత్మహత్య!

ప్రముఖ సీనియర్ నటి జయసుధ భర్త నితిన్ కపూర్(58) ఆత్మహత్య చేసుకొని మృతిచెందారు. మంగళవారం ముంబైలోని తన నివాసంలో నితిన్ కన్నుమూశారు. అయితే ఆయన ఎలా చనిపోయారనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నితిన్ మరణానికి ఆర్థిక కారణాల లేక ఆరోగ్యపరమైన కారణాలేమైనా ఉన్నాయ అనే విషయాలు తెలియాల్సిఉంది. విషయం తెలుసుకున్న జయసుధ హుటాహుటిన ముంబై బయలుదేరారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు జితేంద్రకు సోదరుడైన నితిన్ కపూర్ 1985లో జయసుధను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. నితిన్ తెలుగులో పలు సినిమాలు నిర్మించారు.