HomeTelugu Big Storiesగాడ్‌ఫాదర్‌: ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేసింది

గాడ్‌ఫాదర్‌: ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేసింది

Thaar Maar Thakkar Maar Ly
మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘గాడ్‌ఫాదర్‌’ మూవీ ఫస్ట్‌ సింగల్‌ వచ్చేసింది. రెండు రోజుల క్రితం ప్రోమో ని విడుదల చేసిన చిత్రబృందం తాజాగా లిరికల్‌ సాంగ్‌ని విడుదల చేసింది. ‘తార్‌ మార్‌ తక్కర్‌ మార్‌’ అంటూ సాగే ఈ పాట నెటిజన్లను ఆకట్టుకుంటుంది. చిరంజీవి, సల్మాన్‌ ఖాన్‌ పై చిత్రీకరించిన ఈ పాటలో ఈ ఇద్దరు హీరోలు డాన్స్‌ ఓ రేంజ్‌లో చేసినట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. అనంత శ్రీరామ్‌ రాసిన ఈ పాటను.. శ్రేయ ఘోషల్‌ ఆలపించగా.. తమన్‌ సంగీతం అందించారు.

మోహన్‌ రాజా డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా మలయాళ మూవీ ‘లూసీఫర్‌’ కు రీమేక్‌గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో సల్మాన్‌ ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రామ్‌ చరణ్‌, ఎన్‌.వి.ప్రసాద్‌, ఆర్‌. బి. చౌదరి సయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబరు 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu