HomeTelugu Trending'పుష్ప'తో తరుణ్‌ రీ ఎంట్రీ!

‘పుష్ప’తో తరుణ్‌ రీ ఎంట్రీ!

Tharun re entry with pushp

టాలీవుడ్‌లో బాల నటుడిగా అలరించిన తరుణ్‌ ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మంచి హిట్‌తో రొమాంటిక్ హీరోగా అదరగొట్టారు. ‘నువ్వే కావాలి’ వంటి బ్లాక్ బస్టర్ తో పాటు కొన్ని హిట్ సినిమాలలో హీరోగా నటించారు. ఆ తరువాత వచ్చిన సినిమాలు తరుణ్‌కు పెద్దగా కలిసి రాలేదు. తాజాగా తరుణ్‌ ‘పుష్ప’ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. తరుణ్ ఇటీవల ఆహా ఓటీటీ లో విడుదలైన అనుకోని అతిథి సినిమాలో నటుడు ఫహాద్ ఫాజిల్‌కు డబ్బింగ్ చెప్పారు. తరుణ్ వాయిస్ ఫహాద్ ఫాజిల్‌కు చక్కగా కుదిరింది. దీంతో పుష్ప సినిమాలో ఫహాద్ ఫాజిల్ పాత్రకు తరుణ్ చేతనే డబ్బింగ్ చెప్పించాలని భావిస్తున్నటడ డైరెక్టర్‌ సుకుమార్. దీంతో పుష్ప సినిమాలో తరుణ్ కనిపించకపోయినా వినిపిస్తారనే టాక్ వినిపిస్తుంది. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో చూడాలి.

పుష్ప సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ప్యాన్ ఇండియా లెవల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ పుష్ప సినిమా మొన్నటి వరకు షూటింగ్ జరుపుకుంది. కరోనా కారణంగా ఇటీవల షూటింగ్ వాయిదా పడింది. ‘పుష్ప’ చిత్రానికి పార్ట్‌ 2 కూడా ఉండబోతుందట. ఈ చిత్రం ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. పుష్ప తెలుగు, హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషాల్లో విడుదలచేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu