HomeTelugu Trendingవిరాటపర్వం: 'ది బర్త్ ఆఫ్ వెన్నెల'

విరాటపర్వం: ‘ది బర్త్ ఆఫ్ వెన్నెల’

The Birth Of Vennela form
సాయిపల్లవి – రానా ప్రధాన పాత్ర పోషించిన ‘విరాటపర్వం’ సినిమా ఈ నెల 17వ తేదీన థియేటర్లకు వస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో .. ‘ది బర్త్ ఆఫ్ వెన్నెల’ అనే టైటిల్ తో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అడవిలో .. అర్ధరాత్రివేళలో .. వర్షం కురుస్తూ ఉండగా ఓ స్త్రీకి పురిటి నొప్పులు మొదలవుతాయి.

ట్రాక్టర్ పై ఆమెను హాస్పిటల్ కి తీసుకుని వెళుతూ, నక్సలైట్స్ కీ .. పోలీసులకి మధ్య జరుగుతున్న కాల్పుల్లో చిక్కుకుంటారు. అప్పుడు ఒక లేడీ నక్సలైట్ ఆమెకి పురుడు పోసి .. ఆ పాపకి ‘వెన్నెల’ అనే పేరు పెడుతుంది. ఆ మరుక్షణమే ఆ లేడీ నక్సలైట్ పోలీస్ తూటాలకు బలవుతుంది.

అలా పోరాటంలో పుట్టిన ఆ వెన్నెలనే ఈ సినిమా కథానాయిక సాయిపల్లవి. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా .. ఎమోషనల్ గా ఉంది. సినిమాపై ఆసక్తిని రేకెత్తించేదిగా ఉంది. అటవీ ప్రాంతంలో చీకట్లో మగ్గుతున్న జీవితాలకు వెలుగునిచ్చే పాత్రను సాయిపల్లవి పోషించిందని అనుకోవచ్చు. ప్రేమ – పోరాటం ఈ రెండింటికీ మధ్య ఈ కథ నడుస్తుందని భావించవచ్చు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu