HomeTelugu Trending'ది ఘోస్ట్' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ డేట్‌ ఫిక్స్‌

‘ది ఘోస్ట్’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ డేట్‌ ఫిక్స్‌

The ghost pre release event
నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రం ‘ది ఘోస్ట్’. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాని సునీల్ నారంగ్, శరత్ మరార్, రామ్మోహన్ రావు నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ‘కర్నూల్’ ఎస్.టి.బి.సి కాలేజ్ గ్రౌండ్స్ .. వేదిక కానుంది. నాగచైతన్య, అఖిల్ ఈ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి హాజరు కానున్న విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ ను విడుదల చేశారు.

ఈ సినిమా సోనాల్ చౌహన్ హీరోయిన్‌గా నటించింది. సురేంద్రన్, రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. మార్క్ కె రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందని అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu