HomeTelugu Trendingది ఘోస్ట్‌: నాగ్‌ వాడిన ఆయుధం ఇదే..

ది ఘోస్ట్‌: నాగ్‌ వాడిన ఆయుధం ఇదే..

The Ghost update
టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’. ప్ర‌వీణ్ స‌త్తారు డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ చిత్రంలో ది ఘోస్ట్ ఉప‌యోగించిన ఆయుధం (క‌త్తి) లుక్‌ను విడుద‌ల చేశారు. అరుదైన స్టీల్ త‌మ‌హ‌గ‌నేతో త‌యారు చేసిన క‌త్తి (జ‌ప‌నీస్ కటన)ని ఈ సినిమాలో వినియోగించారు మేక‌ర్స్. రాడ్లు, ఇనుము కూడా క‌ట్ చేసే సత్తా ఈ క‌త్తికుండ‌టం ఈ జ‌ప‌నీస్ ఆయుధం ప్ర‌త్యేక‌త. క్రిమినల్స్ పై ఈ ఆయుధాన్ని వాడుతాడు ఘోస్ట్‌.

ఆగ‌స్టు 18 ఉద‌యం 10:08 గంట‌ల‌కు భారీ అప్డేట్ ఉండ‌బోతుంద‌ని తాజా పోస్ట‌ర్‌తో తెలియ‌జేశారు. హై ఆక్టేన్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైనర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో గుల్ ప‌నాగ్‌, అనిఖా సురేంద్ర కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున ఇంటర్ పోల్ ఆఫీస‌ర్ విక్ర‌మ్‌గా క‌నిపించ‌బోతున్నాడు. ఈ సినిమా అక్టోబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పీ, నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్ మెంట్స్ బ్యాన‌ర్ల‌పై సునీల్ నారంగ్‌, పీ రామ్మోహ‌న్ రావు, శ‌ర‌త్ మ‌రార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మార్క్ కే రాబిన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu