HomeTelugu Trendingవిరాటపర్వం: 'ద వాయిస్ ఆఫ్ రావణ' వీడియో విడుదల

విరాటపర్వం: ‘ద వాయిస్ ఆఫ్ రావణ’ వీడియో విడుదల

VirataParvam

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రానా దగ్గుబాటి వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే అరణ్య విడుదల కాగా విరాటపర్వం, భీమ్లా నాయక్ విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ రోజు రానా బర్త్‌డే సందర్భంగా విరాటపర్వం సినిమా నుంచి ఓ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

‘ద వాయిస్ ఆఫ్ రావణ’ పేరుతో ఓ వీడియోను విడుదల చేయగా అందులో రానా లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. మావోయిస్టు నేపథ్యంగా వస్తున్న ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమాలో ప్రియమణి, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu