HomeTelugu Trendingది వారియ‌ర్: సెన్సార్‌ పూర్తి

ది వారియ‌ర్: సెన్సార్‌ పూర్తి

The warrior
టాలీవుడ్‌ యంగ్‌ హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం ‘ది వారియ‌ర్’. ఎన్‌.లింగుస్వామి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా నుండి ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్‌లు, పాట‌లు సినిమాపై విప‌రీత‌మైన అంచ‌నాల‌ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం జూలై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో చిత్ర‌బృందం ప్రమోష‌న్‌ల‌ను జోరుగా జ‌రుపుతుంది.

ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్‌ యూ/ఏ స‌ర్టిఫికేట్ జారీ చేసింది. 2గంట‌ల 35నిమిషాల ర‌న్ టైంను మేక‌ర్స్ లాక్ చేశారు. ఈ సినిమాలో కృతి శెట్టీ హీరోయిన్‌గా న‌టించగా.. ఆది పినిశెట్టి విలన్‌ పాత్ర‌లో న‌టించాడు. శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్ ప‌తాకంపై శ్రీనివాస్ చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు. ద్విభాషా చిత్రంగా తెర‌కెక్కిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌న్ని చార్ట్ బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి. బుల్లెట్ పాట మిలియ‌న్‌ల వ్యూస్ తో.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu