HomeTelugu Trending'జయమ్మ పంచాయితి' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘జయమ్మ పంచాయితి’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Jayamma panchayathi release

ప్రముఖ స్టార్‌ యాంకర్ సుమ కనకాల నటించిన తాజా చిత్రం ‘జయమ్మ పంచాయితి’. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ అందరి దృష్టిని ఆకర్షించింది. విలేజ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకి విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించారు. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై బలగ ప్రకాష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. అయితే తాజాగా ‘జయమ్మ పంచాయితి’ సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు.

రాధే శ్యామ్ మొదటి రోజు వసూళ్ళు..!

దీంతో పాటు ఫన్నీ వీడియోతో కూడా విడుదల చేశారు. సుమ వాయిస్ ఓవర్ తో సాగిన ఈ వీడియోలో సినిమా విడుదలకు సంబంధించి ఫన్నీ కాన్వర్జేషన్ సాగింది. ఇందులో తన సినిమాను విడుదల చేయడానికి సరైన తేదీని ఎంచుకోవదానికి సంబంధించి జయమ్మ పడిన గందరగోళం కన్పిస్తోంది. ఆమె చివరకు ఏప్రిల్ 22ని విడుదల తేదీగా నిర్ణయించింది. మొత్తానికి ఒక మంచి ఫ్యామిలీ అండ్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీతో సుమ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu