HomeTelugu TrendingThug Life: తప్పుకున్న మరో యంగ్‌ హీరో!

Thug Life: తప్పుకున్న మరో యంగ్‌ హీరో!

Thug Life After Dulquer Sal

 Jayam Ravi walks out of Thug Life: లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్‌లో.. కమల్ హాసన్ ప్రథాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘థగ్ లైఫ్‌’. కమల్ హాసన్ – మణిరత్నం చివరిసారిగా నాయకన్‌ సినిమాకి కలిసి పని చేశారు. 36 ఏళ్ల తరువాత ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా కోసం తిరిగి కలిశారు. దీంతో ఈ సినిమాపై భారీ హైప్స్‌ ఏర్పడ్డాయి.

యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలెండ్‌ నటుడు దుల్కర్ సల్మాన్ ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. కమల్ – దుల్కర్ ల మధ్య మంచి పోటాపోటీ సన్నివేశాలు ఫ్యాన్స్‌ అనుకున్నారు. అయితే అనుకోకుండా.. దుల్కర్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు రావడంతో అందరూ షాక్‌ అయ్యారు. దుల్కర్‌ ప్లేస్‌లో శింబుని తీసుకోనున్నట్లు తెలుస్తుంది.

Thug Life 1

ఇక ఈ సినిమాలో జయం రవి కూడా ఓకీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈయన కూడా ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది. డేట్స్‌ విషయంలో క్లాష్‌ రావడంతో ఆయన తప్పుకున్నట్లు తెలుస్తుంది. యంగ్‌ హీరోలు ఇద్దరూ ఈ సినిమా నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వార్తలపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

ఈ సినిమాలో.. త్రిష, నాజర్, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తారు.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu