HomeTelugu Trendingఅకుంలేంట్రా.. కేసు వేస్తా: బ్రహ్మాజీ

అకుంలేంట్రా.. కేసు వేస్తా: బ్రహ్మాజీ

Tollywood actor brahmaji tw

టాలీవుడ్‌ నటుడు బ్రహ్మాజీ తాజాగా చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే బ్రహ్మాజీ ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటారు. ఈ క్రమంలో ‘వాట్స్ హ్యాపెనింగ్’ (ఏం జరుగుతోంది?) అని తన సెల్ఫీని పోస్టు చేస్తూ అభిమానులను అడిగాడు. అది చూసిన ఓ అభిమాని ‘ఏం లేదు అంకుల్’అని బదులిచ్చాడు. ఆ రిప్లై చూసిన బ్రహ్మాజీ దానిని రీ ట్వీట్ చేస్తూ ‘అంకులేంట్రా అంకుల్. కేసు వేస్తా, బాడీ షేమింగ్ చేస్తున్నావా?’ అంటూ నవ్వుతున్న ఎమోజీని జతచేశారు. అంతే.. క్షణాల్లోనే అది వైరల్ అయింది. అభిమానులు సరదా కామెంట్లతో ట్విట్టర్‌ను హోరెత్తించారు.

ఆంటీని మళ్లీ రెచ్చగొట్టారని ఒకరంటే.. ఎన్ని కేసులు వేస్తానని బెదిరించినా ఆ ఆంటీకి వచ్చినంత పేరు మాత్రం మీకు రాదని ఇంకొకరు కామెంట్ చేశారు. #SayNotToOnlineAbuse అనే హ్యాష్‌ట్యాగ్‌ మర్చిపోయారు అంకుల్‌’ అని మరొకరు.. ఇలా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు బ్రహ్మాజీ తనను అంకుల్ అంటే కేసు పెడతానన్న సెటైరికల్ ట్వీట్‌‌ను ‘గుడ్ టైమింగ్’ అని అభిమానులు ప్రశంసిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu