HomeTelugu Trending'డిస్కో రాజా' కోసం పాట పాడిన రవితేజా.. వీడియో

‘డిస్కో రాజా’ కోసం పాట పాడిన రవితేజా.. వీడియో

8 13
మాస్‌ మహారాజా.. రవితేజ హీరోగా నటించిన సినిమా ‘డిస్కో రాజా’. ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేశ్‌, తాన్య హోప్‌ హీరోయిన్‌లుగా నటించారు. వి.ఐ. ఆనంద్‌ దర్శకత్వం వహించారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం ఈ చిత్రంలోని ‘రమ్‌ పమ్‌ బమ్‌’ అంటూ సాగే పాట లిరికల్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.

ఎస్‌ ఎస్‌ తమన్‌ ఈ పాటకు స్వరాలు సమకూర్చగా, సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. రవితేజ, బప్పిలహరి ఆలపించారు. తొలిసారి ‘బలుపు’ చిత్రం కోసం పాట పాడిన రవితేజ ఆ తర్వాత ‘పవర్‌’, ‘రాజా ది గ్రేట్‌’ చిత్రాల్లోనూ తన గొంతు వినిపించారు. ఆ పాటలన్నీ అలరించాయి. ఇప్పుడు మళ్లీ తమన్‌ సంగీత సారథ్యంలోనే ఈ పాటను పాడటం విశేషం. మరి ఈ పాట ఎంత ట్రెండ్‌ అవుతుందో చూడాలి. అన్నట్లు హాస్య నటుడు సునీల్‌ ఇందులో ఒక డిఫరెంట్‌ గెటప్‌లో కనిపించారు. కావాలంటే మీరూ పాట చూసేయండి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu