HomeTelugu Trendingజగన్‌తో సినీ పెద్దల మీటింగ్‌ ?

జగన్‌తో సినీ పెద్దల మీటింగ్‌ ?

10 3
లాక్‌డౌన్‌ కారణంగా సినిమా ఇండస్ట్రీ ఇన్నిరోజులూ మూతపడిన విషయం తెలిసిందే. ఇటీవలే సినీపెద్దలు తెలంగాణ సీఎం కేసీఆర్ తో సంప్రదింపులు జరిపి షూటింగ్‌లు జరుపుకునేందుకు అనుమతిని కోరారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం షూటింగులకు అనుమతి ఇచ్చింది. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను టాలీవుడ్ సినీ పెద్దలు కలవనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జగన్ అపాయింట్‌మెంట్ కూడా లభించినట్లు తెలుస్తోంది. ఈనెల 9వ తేదీన మంగళవారం కలవనున్నట్లు సమాచారం.

ఈ సమావేశంలో సినిమా షూటింగులకు అనుమతులు, ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి, తదితర అంశాలను చర్చించే అవకాశం ఉంది. కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీలోని ప్రతి విభాగం నుంచి ఇద్దరు మాత్రమే ఈ సమావేశానికి హాజరుకానున్నారట. ఎవరెవరిని తీసుకెళ్తున్నారన్నదానిపై స్పష్టత లేదు. ఈ మీటింగ్ కు నందమూరి బాలకృష్ణను ఆహ్వానిస్తారా.. లేదా? అన్నది తెలియాల్సి ఉంది. బాలకృష్ణ హీరో మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు కూడా.. ఈ మీటింగ్ కు బాలయ్య వస్తారా.. లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu