ప్రముఖ దర్శకుడి భవనం కూల్చివేత


దర్శకుడు వివి. వినాయక్‌కు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. హైదరాబాద్‌ సమీపంలోని వట్టినాగులపల్లిలో వీవీ వినాయక్‌ నిర్మించుకుంటున్న భవనాన్ని అనుమతి లేదంటూ అధికారులు కూల్చివేశారు. 111 జీవోకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని వివి. వినాయక్‌కు అధికారులు నోటిసులు జారీ చేశారు. వివి. వినాయక్ నుంచి స్పందనరాకపోవడంతో నాలుగు అంతస్తుల భవనాన్ని కూల్చివేశారు. అయితే వట్టినాగులపల్లి గ్రామ పంచాయతి పరిధిలోకి వస్తోంది. ఇటీవల కాలంలో వజ్రాలపల్లిని మున్సిపాలిటీగా అధికారులు బదిలీ చేశారు. దీంతో ఈ ప్రాంతం పూర్తిగా త్రిపుల్ వన్ జీవో పరిధిలోకి వస్తోంది. ఇక్కడ జీ+2 మాత్రమే నిర్మించాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ నిర్మాణాలు చేపట్టేందుకు అధికారులు అనుమతించరు. ఈ జీవో ప్రకారం జీహెచ్ఎంసీ అధికారులు వివి.వినాయక్ భవనంపై చర్యలు తీసుకున్నారు.