HomeTelugu Trendingహీరో విశ్వక్‌సేన్‌కు కరోనా

హీరో విశ్వక్‌సేన్‌కు కరోనా

Tollywood hero vishwak sen

టాలీవుడ్‌ యంగ్‌ హీరో విశ్వక్‌సేన్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్‌మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు. ‘నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వైద్యులు ఇచ్చిన సూచనలు పాటిస్తున్నా. వ్యాక్సిన్‌ వేయించుకున్నప్పటికీ కరోనా బారినపడటం దురదృష్టకరం. కరోనా మరోసారి వేగంగా విస్తరిస్తోంది. కాబట్టి దయచేసి అందరూ మాస్కులు ధరించండి. మీ కుటుంబ సభ్యులనూ జాగ్రత్తగా చూసుకోండి’ అని విశ్వక్‌ పోస్ట్‌ పెట్టారు. మరోవైపు విశ్వక్‌కు పాజిటివ్‌ అని తెలియడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ‘గెట్‌ వెల్‌ సూన్‌ అన్నా’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu