HomeTelugu Big StoriesTollywood Heroes Industry Hits : టాప్‌లో ఉన్న హీరో ఎవరంటే?

Tollywood Heroes Industry Hits : టాప్‌లో ఉన్న హీరో ఎవరంటే?

Industry Hits Of Tollywood Tollywood Heroes Industry Hits,chiranjeevi,prabhas,balakrishna,rajinikanth

Tollywood Heroes Industry Hits: 90 ఏళ్ల తెలుగు సినిమా ప్రస్థానంలో దేశం గర్వించదగిన ఎందరో హారోలు వచ్చారు. వీళ్లలో కొందరు సూపర్ స్టార్లు, మెగాస్టార్లు అయ్యారు. చాలా మంది హీరోలు వందల సంఖ్యల్లో సినిమాల్లో నటించారు. కానీ వాటిలో ఇండస్ట్రీ హిట్ దక్కించుకున్న సినిమాలు చాలా తక్కువ అనే చెప్పాలి. వారి కెరీర్లో ఎక్కువ ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న నటుడు ఎవరో తెలుసా?

నిజానికి ఈ 9 దశాబ్దాలలో 40 సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచినట్లు అంచనా వేశారు. వీటిలో ఎక్కువ సినిమాలు మెగాస్టార్ చిరంజీవివే కావడం విశేషం. టాలీవుడ్ టాప్ హీరోస్ అయిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నుంచి చిరంజీవి, మహేశ్​ బాబు వరకు చాలా మంది పెద్ద హీరోల ఖాతాలో ఇండస్ట్రీ హిట్లు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. మరి టాలీవుడ్​లో ఎక్కువ ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న హీరోలు ఎవరు? వారిలో టాప్ స్థానంలో ఉన్న వారెవరో ఇప్పుడు మనం చూద్దాం.

మెగాస్టార్‌ చిరంజీవి 45 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అసలు తెలుగు సినిమా దశ, దిశనే మార్చేసిన సుప్రీం హీరో ఆయనే. తర్వాత మెగాస్టార్ గా ఎదిగి దశాబ్దాల పాటు సినిమా ఇండస్ట్రీని శాసించాడు. సహజంగానే అలాంటి హీరోవే అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ ఉంటాయనడంలో సందేహం లేదు.

చిరంజీవి ఇప్పటి వరకూ 150కిపైగా సినిమాలు చేసాడు. అయితే ఇండస్ట్రీ హిట్స్ లో 8 సినిమాలు చిరంజీవి నటించినవే కావడం గమనార్హం. 1983లో తొలి ఇండస్ట్రీ హిట్ అందుకున్న చిరు.. 2002 వరకూ తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించాడు. ఈ 20 ఏళ్ల కాలంలోనే చిరంజీవి కెరీర్లో అత్యధిక హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి.

Tollywood Heroes Industry Hits

చిరంజీవి
1. ఖైదీ
2. పసివాడి ప్రాణం
3. యముడికి మొగుడు
4. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు
5. జగదేక వీరుడు అతిలోక సుందరి
6. గ్యాంగ్ లీడర్
7. ఘరానా మొగుడు
8. ఇంద్ర

అక్కినేని నాగేశ్వరరావు 
బాలరాజు,
దేవదాసు,
రోజులు మారాయి,
మాయాబజార్,
దసరా బుల్లోడు,
ప్రేమాభిషేకం

ఎన్టీఆర్ 
పాతాల భైరవి,
మాయాబజార్,
లవ కుశ,
అడవి రాముడు

Tollywood Heroes Industry Hits

బాలకృష్ణ
ముద్దుల మావయ్య,
సమర సింహా రెడ్డి,
నరసింహ నాయుడు..

పవన్ కల్యాణ్
ఖుషీ,
అత్తారింటికి దారేది

మహేష్ బాబు
పోకిరి

రామ్ చరణ్
మగధీర

ప్రభాస్
బాహుబలి 2,

కృష్ణ
అల్లూరి సీతారామరాజు

Tollywood Heroes Industry Hits

రజనీకాంత్
ఇండియన్ సినిమాలో రజనీ టాప్ లో ఉన్నారు. మొత్తం ఇండియన్ సినిమాలో అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ సొంతం చేసుకున్న హీరోగా రజనీకాంత్ కు పేరుంది. రజనీకాంత్ అన్ని భాషల్లో కలిపి 160కిపైగా చిత్రాల్లో నటించారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ఇండియావైడ్​గా అందరి కన్నా ఎక్కువ ఇండస్ట్రీ హిట్లు తన ఖాతాలో వేసుకుని టాప్​లో నిలిచారు. అతని కెరీర్లో మొత్తం 15 ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి.

1. పదహారు వయదినిలే
2. మురత్తు కాలై
3. పదిక్కతవన్
4. మనితర్
5. దళపతి
6. మన్నన్
7. అన్నమలై
8. భాషా
9. పెద రాయుడు
10. నరసింహ
11. చంద్రముఖి
12. శివాజీ
13. రోబో
14. కబాలీ
15. 2.0
ఇక కన్నడ స్టార్ రాజ్ కుమార్ (14), కమల్ హాసన్ (13), మమ్ముట్టి (12), మోహన్ లాల్ (10)లాంటి వాళ్లు ఈలిస్టులో ఉన్నారు. వీళ్ల తర్వాత 8 హిట్స్ తో చిరంజీవి ఆరో స్థానంలో ఉన్నాడు.

 

 

 

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu