‘అన్‌స్టాప‌బుల్-2’ లెజెండరీ దర్శక నిర్మాతల సందడి

నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో ‘అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ -2’. ఈ షోలో బాలయ్య.. ప్రముఖలతో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కొత్త ఎపిసోడ్‌ ఎవరితో ఉండబోతుందనే దానిపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందించింది ఆహా టీం.

ఈ సారి లెజెండరీ దర్శకుడు కోదండరామిరెడ్డి, కే రాఘవేంద్రరావు, నిర్మాతలు దగ్గుబాటి సురేశ్‌బాబు, అల్లు అరవింద్‌తో సరదా చిట్‌చాట్ చేశాడు బాలకృష్ణ. లెజెండరీ దర్శక,నిర్మాతలతో ఈ వారం అన్‌స్టాపబుల్-2. ఎపిసోడ్-5 డిసెంబర్‌ 2న ప్రీమియర్ కానుందని ఆహా టీం ట్వీట్ చేసింది. అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2లో ఇప్పటికే విడుదలైన సిద్దు జొన్నలగడ్డ, శర్వానంద్‌తోపాటు పలువురు రాజకీయ ప్రముఖులకు సంబంధించిన ఎపిసోడ్స్‌ ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు సినీ జనాలు‌.

బాలకృష్ణ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్‌ గోపీచంద్ మ‌లినేనితో వీరసింహారెడ్డి చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన జై బాలయ్య సాంగ్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. పక్కా పవర్‌ ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అనంతరం అనిల్ రావిపూడితో ఎన్‌బీకే108 సినిమా చేయనున్నాడు బాలకృష్ణ.

CLICK HERE!! For the aha Latest Updates