HomeTelugu Big StoriesKalki 2898 ADలో టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు..త్వరలో టీజర్‌

Kalki 2898 ADలో టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు..త్వరలో టీజర్‌

Tollywood star heroes in Ka

Kalki 2898 AD: పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని టాలీవుడ్‌లోని బడా నిర్మాణ సంస్థల్లో ఒకటైన వైజయంతీ మూవీస్ బ్యానర్ నిర్మిస్తుండగా.. అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటి దీపికా పదుకొణె, దిశా పటానీలు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సుమారు రూ. 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమిళ స్టార్‌ హీరో కమల్ హాసన్ విలన్‌గా చేస్తున్నారు. అలాగే బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Tollywood star1

ఈ సినిమాలో మరికొందరు పాపులర్ హీరోలు గెస్ట్ అప్పీయరెన్స్ ఇస్తున్నారని టాక్‌. జూనియర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని ఈ సినిమాలో నటిస్తున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. కల్కి మూవీ సైన్స్ ఫిక్షన్ జోనర్‌కు సంబంధించిందని విడుదలైన గ్లింప్స్ చూస్తుంటే అర్థం అవుతోంది. ఎన్టీఆర్ పరశురాముడిగా, నాని కృపాచార్య కనిపించనున్నారు అని టాక్‌.

ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కాగా కల్కి 2898 ఏడీ మూవీ మే 9న విడుదల కానున్నట్లు సమాచారం. వైజయంతీ మూవీస్ కి ఈ డేట్‌ సెంటిమెంట్‌.. జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి, మహర్షిలు సినిమాలు అప్పుడే విడుదలయ్యాయి. దీంతో కల్కి కూడా అప్పడే వస్తుంది అని అంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌ ఫిబ్రవరి 11 నుండి ప్రారంభం కానున్నాయి అని త్వరలోనే టీజర్‌ విడుదల కాన్నుట్లు తెలుస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu