పవన్ పై జెడి చక్రవర్తి కామెంట్స్!

నటుడుగా పెద్దగా రాణించకపోవడంతో ప్రస్తుతం దర్శకుడుగా మారి సినిమాలు తీసి నిలదొక్కుకోవడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు జెడి చక్రవర్తి. ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న జెడి పవన్ కళ్యాణ్ పై తనకు ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇస్తూ పవన్ సినిమాల వల్ల అభిమానులు ప్రభావితం అవుతారన్నది తప్పు. పవన్ చేసే సోషల్ యాక్టివిటీస్ వల్ల ప్రభావితం అవ్వాలి.

సినిమాల వల్ల జనాలు వచ్చి ఓట్లే వేస్తారు అనుకుంటే అది పొరపాటు అంటూ కామెంట్స్ చేసాడు. అయితే పవన్ కళ్యాణ్ సోషల్ యాక్టివిటీస్ చాలా చేస్తున్నారు కాబట్టే ఆయనకు అంత ఫాలోయింగ్ ఉంది అని అంటూ ఒకవైపు పవన్ మ్యానియా పై  విమర్శలు చేస్తూ మరొకవైపు పవన్ పై ప్రశంసలు కురిపించాడు.