HomeTelugu Big StoriesTollywood Tier2 Heroes: ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించలేకపోతున్నారా?

Tollywood Tier2 Heroes: ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించలేకపోతున్నారా?

 

Tollywood Tier2 Heroes:Tollywood Tier2 Heroes: ఎన్నికలు, ఐపీఎల్ హడావుడి దెబ్బకి సినిమా థియేటర్లన్నీ వెలవెలబోతున్నాయి. పెద్ద సినిమాల రిలీజ్ లేక, చిన్న సినిమాలకు ఆడియన్స్ రాక థియేటర్లకు కోలుకోలేని దెబ్బ పడింది. దీంతో ఇటీవలే సింగిల్ స్క్రీన్ థియేటర్లను 10 రోజులు క్లోజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. తాజాగా ఇదే విషయంపై ప్రొడ్యూసర్‌ అడ్డాల మాట్లాడుతూ.. థియేటర్లకు జనాలు వచ్చే పరిస్థితి లేదు. పెద్ద హీరోలు లేదా.. చాలా మంచి బజ్‌ ఏర్పడితే తప్ప.. జనాలు సినిమా హాళ్లకు రావడం లేదు అన్నారు.

ఈ రోజుల్లో జనాలు ఎలా ఆలోచిస్తున్నారంటే.. రిలీజ్‌ అయిన 20 రోజులకే సినిమా మన ఇంటికే వచ్చేస్తుంది. ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తుంది ఇక అటువంటప్పుడు థియేటర్స్‌కి వెళ్లడం ఎందుకు అని ప్రేక్షకుడు ఆలోచిస్తున్నాడు. ట్రైలర్‌తోనే ఆ మూవీకి వెళ్లాలా లేదా అనేది ఓ అంచనా వేసేస్తున్నారు. లేదా అల్లు అర్జున్‌, ప్రభాస్‌, రామ్‌చరణ్‌ లాంటి హీరోల సినిమాలు అదీ మంచి కంటెంట్‌ ఉంటే తప్ప రావడం లేదు.

చిన్న సినిమాలకోసం థియేటర్లకు వచ్చే పరిస్థితులు లేవు. ఈ క్రమంలో సినిమా హాళ్లు.. పంక్షన్ హాల్స్‌గా మార్చుకోవాల్సి వస్తుంది. ఐమ్యాక్స్‌, మల్టీప్లెక్స్‌లు మినహాయించి ఇప్పటికే సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు మూతపడ్డాయి. ఈ రోజుల్లో డెబ్యూట్‌ హీరోలు కూడా పాన్‌ ఇండియా కావలంటున్నారు. అయితే వారికి ఇచ్చే రెమ్యూనరేషన్‌ కూడా మేకర్స్‌కి రావడం లేదు. థియేటర్‌ యజమానుల పరిస్థితి కూడా ఇదే. థియేటర్‌కి ఒకరు ఇద్దరు తప్ప ప్రేక్షకులు రావడం లేదు. వారు కూడా థియేటర్‌లో నువ్వు తీసుకున్న రెమ్యూనరేషన్‌కి న్యాయం చెయ్యి లేచి ఫైట్‌ చేయి, డైలాగ్స్‌ చెప్పు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ప్రేక్షకులు సినిమా చూసే పద్దతి కూడా మారిపోయింది. వారికి పూర్తి అవగాహన వచ్చింది. ఓటీటీ అదుబాటులోకి వచ్చిన తరువాత ప్రేక్షకుడు కంటెంట్‌ ఉన్న మూవీలకు అలవాటు పడిపోయాడు. బలగం, ఓ బేబి, డీజే టిల్లు వంటి సినిమాలు ఎందుకు ఆడాయి… కంటెంట్‌ ఉంది కాబట్టే. ఈ క్రమంలోనే ఓ మంచి కంటెంట్‌ ఉన్న మూవీ తీస్తే.. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. లేదంటే.. స్టార్‌ హీరోల సినిమా తప్పితే.. చిన్న హీరోల సినిమాలు ఆడవు. అందుకే కొత్త డైరెక్టర్‌లకు ఛాన్స్‌ ఇవ్వడం లేదు. లేదా.. నా దగ్గర రూ.1000 కోట్లు ఉండి.. బినామీ అయి ఉంటే.. కొత్త దర్శకులకు కూడా ఛాన్స్‌ ఇవ్వొచ్చు. కంటెంట్‌ చూడాలి. ఇప్పుడు ప్రొడ్యూసర్‌ కొంతమందికి వారు తీసే సినిమా కథ కూడా తెలియదు. అడిగితే చెప్పలేరు… అలా వుంది ఇప్పటి ప్రొడ్యూసర్లలో కొందరి పరిస్థితి.

ఈక్రమంలో అడ్డాల చంటి.. ఓ స్టార్‌ హీరోతో సినిమా ప్లాన్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఇంటిలో ఉన్న స్టార్‌ ఇండియా స్టార్‌ అయిపోయాడు. ఇప్పట్లో సినిమా ఉండకపోవచ్చు. కానీ తప్పకుండా ఆ హీరోతో సినిమా తీస్తాను. అప్పటికీ ఆయన ఏ రేంజ్‌లో ఉంటాడో.. మరో ప్రోడ్యూసర్‌తో కలిసి అయినా సినిమా చేస్తాను అన్నారు. ఇక బాలయ్యతో గతంలో రెండు సినిమాలు చేసాను. ఈ మధ్య ఓ సినిమా చేద్దాం అని ట్రై చేశాను. అయితే ఎలక్షన్స్‌ తరువాత కలుద్దాం అని అన్నట్టు ఆ నిర్మాత చెప్పారు. త్వరలోనే అడ్డాల చంటితో బాలయ్య సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu