HomeTelugu Big StoriesKalki2898AD: సీన్ మొత్తం రివర్స్.. ప్రభాస్ కి ఇలా మొదటిసారి!

Kalki2898AD: సీన్ మొత్తం రివర్స్.. ప్రభాస్ కి ఇలా మొదటిసారి!

Kalki2898AD trailer
Good start for Prabhas Kalki 2898AD

Kalki 2898AD Update:- స్టార్ హీరోల చిత్రాల విషయంలో మొదటి నుంచి అంచనాలు భారీగా ఉంటాయి. అయితే ప్రమోషనల్ కంటెంట్ బయటకు వచ్చే కొద్ది.. సినిమాపై అంచనాలు కొన్నిసార్లు తగ్గిపోతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఇది ఎన్నో ప్రభాస్ సినిమాలకు జరుగుతూ వచ్చింది.

ఉదాహరణకి ప్రభాస్ ఆది పురుష్ సినిమా.. విషయంలో రామాయణం ఆధారంగా సినిమా అనగానే.. ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అంతేకాకుండా ఆ సినిమాపై.. భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ చిత్ర పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి.. బయటకు వచ్చే కొద్ది సినిమా ఎలా ఉండబోతుందో.. అని ఆసక్తి కంటే ఆందోళన ఎక్కువైంది. బాహుబలి తర్వాత వచ్చిన సాహో విషయంలో కూడా అదే జరిగింది. మొదట్లో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్న.. నెమ్మదిగా తగ్గుతూ వచ్చాయి. దాదాపు ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన ప్రభాస్ సినిమాలు అన్నీ కూడా.. ప్రమోషనల్ కంటెంట్ వచ్చే కొద్ది అంచనాలు తగ్గుతూ వచ్చాయి.

అయితే మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తీస్తోన్న.. కలికి సినిమా విషయంలో మాత్రం ఇది పూర్తి రివర్స్ అయ్యింది.  మొదట ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్.. దర్శకత్వంలో సినిమా అనగానే.. ప్రభాస్  అభిమానులు సరే అనుకున్నారు. సినిమాకి ప్రాజెక్ట్ కే.. అనే టైటిల్ ఫిక్స్ అయ్యాక.. మళ్లీ ఏదో గ్రాఫిక్స్ సినిమా అయ్యుంటుందని.. ఇదేం హిట్ అవుతుంది ..అని అందరూ కామెంట్స్  పెద్ద సాగారు. అంతేకాకుండా ఈ సినిమా బడ్జెట్ పెరిగే కొద్దీ రాదే శ్యామ్ లాగా అయిపోతుందేమో అని భయం కూడా పడ్డారు. కానీ ప్రాజెక్టు కే లో కే అంటే కల్కి.. అని రివీల్ అయ్యాక సినిమా ఎలా ఉండబోతుందో.. అని ఆసక్తి మొదలైంది.

More About Kalki2898AD

సినిమాకి సంబంధించిన మొదటి పోస్టర్ విడుదలైనప్పుడు.. ఈ సినిమా కూడా ప్రభాస్ ముందు సినిమాలు  రాదే శ్యామ్, ఆది పురుష్ లాగా.. ఫ్లాప్ అవుతుందేమోనని అభిమానులు కంగారుపడ్డారు. కానీ సినిమాకి సంబంధించిన.. ప్రమోషనల్ కంటెంట్ బయటకు వచ్చే కొద్ది.. సినిమాపై అంచనాలు కూడా భారీ స్థాయిలో పెరుగుతూ వచ్చాయి. చిత్ర బృందం కూడా సినిమాని భారీ లెవెల్ లోనే.. ప్రమోట్ చేసింది.

ఇక ఈ మధ్య విడుదలైన చిత్ర టీజర్, సినిమలో అమితాబ్ బచ్చన్.. పోషిస్తున్న అశ్వత్థామ పాత్ర పోస్టర్, సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విడుదలైన బుజ్జి అండ్ భైరవ అనే చిన్న వెబ్ సిరీస్, సినిమాలో కనిపించనున్న బుజ్జి అనే రోబోటిక్ కార్, కీర్తి సురేష్ ఆ కార్ కి డబ్బింగ్ చెప్పడం, సినిమా యూనిట్ నిజంగానే ఆ కార్ ను హైదరాబాద్, చెన్నై, ముంబై లలో ఎగ్జిబిషన్ లాగా పెట్టడం, నిన్నగాక మొన్న విడుదలైన చిత్ర ట్రైలర్.. ఇలా ఒకదాని తర్వాత మరొకటి కల్కి చిత్రం పై అంచనాలను తారాస్థాయికి తీసుకువెళ్లాయి.

https://x.com/klapboardpost/status/1801540007070732681

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సినిమా గురించి అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. అందరూ కల్కి.. అద్భుతంగా ఉండబోతోంది అని గట్టిగా నమ్ముతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సినిమాకి సంబంధించి ట్రోల్స్ మాత్రం ఎక్కడ కనిపించకపోవడం చాలా మంచి సంకేతం. ఆఖరికి తమిళనాడు నుంచి కూడా ఈ సినిమా మీద ట్రోల్స్ రావడం లేదు. ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి సినిమాలు కూడా తమిళ్ ఇండస్ట్రీ నుంచి ట్రోల్స్ ఎదుర్కున్నాయి. చాలా వరకు తెలుగు ప్యాన్ ఇండియా సినిమాలు.. తమిళ రాష్ట్ర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయాయి. కానీ అక్కడి ప్రేక్షకులు కూడా ఇప్పుడు.. కల్కి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. దానికి మరొక కారణం లోకనాయకుడు కమల్ హాసన్.. సినిమాలో.. విలన్ పాత్రలో కనిపించడం అని కూడా చెప్పుకోవచ్చు.

ఏదేమైనా సినిమా మీద ట్రోల్స్ పెద్దగా లేవు. అంతేకాకుండా బాహుబలి తరువాత ప్రభాస్ నుంచి వచ్చిన చిత్రాలలో.. ప్రమోషనల్ కంటెంట్ వచ్చిన తర్వాత.. ఈ సినిమా ఒక్కదానిపైనే అస్సలు ట్రోల్స్ రాకపోవడం విశేషం. పైగా అన్ని భాషల నుంచి స్టార్ నటీనటులు.. ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. కాబట్టి ఈ సినిమా ఎన్ని రికార్డులను తిరిగి రాస్తుందో తెలియాలి అంటే మాత్రం జూన్ 27 వరకు వేచి చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu