‘బిగ్ బాస్-3లో ఉదయభాను… పారితోషికం ఎంతో తెలుసా!

తెలుగు ‘బిగ్ బాస్ సీజన్ 3’ కి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా బిగ్ బాస్ రియాలిటీ షోకి మంచి క్రేజ్‌ ఉండటంతో తెలుగులో ప్రయోగాత్మకంగా 2017లో సీజన్1 స్టార్ట్ చేయగా.. ఎన్టీఆర్ హోస్ట్ చేయడంతో సూపర్ సక్సెస్ అయ్యింది. అనంతరం 2018లో నేచురల్ స్టార్ సీజన్ 2కి హోస్ట్‌గా వ్యవహరించారు. ఇక మూడో సీజన్‌ కోసం హోస్ట్‌తో పాటు కంటెస్టెంట్స్‌ను వెతికే పనిలో పడింది స్టార్ మా సంస్థ.

హోస్ట్‌గా ఎన్టీఆర్, నాని ఆసక్తిచూపించకపోవడంతో.. విజయ్ దేవరకొండ, వెంకటేష్, నాగార్జున, చిరంజీవి, రానా ఇలా చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే వీరిలో బిగ్ బాస్ హోస్ట్ చేస్తారన్నది ఆసక్తిగా మారింది. ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే.. సీజన్ 1తో పోల్చితే సీజన్ 2లో కంటెస్టెంట్స్ బాగా వీక్ అనే ప్రచారం ఉంది. ఆ ఎఫెక్ట్ రేటింగ్స్‌పై పడింది. వారాంతంలో హోస్ట్ వన్‌మేన్ షో నడిపించినా.. వారం మొత్తం ప్రేక్షకుల్ని టీవీలకు కట్టిపడేయాలంటే కంటెస్టెంట్స్ మంచి పెర్ఫామెన్స్ చూపించాలి. సీజన్‌ 2లో ఇదే కొరతగా కనిపించింది.

అయితే సీజన్ 3లో కంటెస్టెంట్స్ వీక్ అనే లోటును తీర్చేందుకు పాపులర్ సెలబ్రిటీలను రంగంలోకి దించుతుందట స్టార్ మా. వీరిలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఉదయభాను. యాంకర్‌గా.. నటిగా.. సింగర్‌గా.. డాన్సర్‌గా.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని ఉదయభాను బిగ్ బాస్‌ షోలో సందడి చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

సాహసం చేయరా డింబకా, డాన్స్ బేబీ డాన్స్, పిల్లలు పిడుగులు, వన్స్ మోర్ ప్లీజ్ వంటి టీవీ షోలతో నెం.1 యాంకర్‌గా పాపులర్ అయిన ఉదయభాను పెళ్లి తరువాత ఇద్దరు కవలలకు జన్మనివ్వడంతో సినిమాలు, టీవీషో లకు దూరం అయ్యింది. ఇక ఆడియో ఫంక్షన్లలోనూ కనిపించడం అదురుగా మారింది. అపుడెపుడో గుణ శేఖర్ తీసిన ‘రుద్రమదేవి’ ఆడియో రిలీజ్‌లో మెరిసిన ఉదయభాను ఆ తరువాత రెండు మూడు ఫంక్షన్లలలో మాత్రమే కనిపించింది.

ఇక బుల్లితెరపై హాట్ యాంకర్‌గా క్రేజీ సెలబ్రిటీగా పేరు సంపాదించిన ఉదయభానుని బిగ్ బాస్ సీజన్‌ 3కి కంటెస్టెంట్‌గా తీసుకువస్తే కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు షో కాన్సెప్ట్ ప్రకారం కాంట్రవర్శీలకు కూడా కొదువు ఉండదనే అభిప్రాయంతో భారీ రెమ్యునరేషన్‌కి ఒప్పించి ఉదయభానుని బిగ్ బాస్ హౌస్‌కి తీసుకురోబోతున్నారట.

ఉదయభానుకి ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలు లేకపోయినప్పటికీ రోజుకి రూ. 2 లక్షలు పారితోషికం చెల్లించి.. వందరోజులకు గానూ రూ. 2 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన ఉదయభానుకి భారీ ధర పలికినట్టే. బిగ్ బాస్ తెలుగు సీజన్‌లో ఇదే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అంటూ చర్చలు మొదలయ్యాయి. అయితే ఉదయభానుతో పాటు మరో 14 మంది కంటెస్టెంట్స్ లిస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

1. సుడిగాలి సుధీర్
2. యాంకర్ రష్మి
3. టీవీ నటి హరిత
4. వరుణ్ సందేశ్
5. హేమ చంద్ర
6. యాంకర్ ఉదయభాను
7. హీరో కమల్ కామరాజు
8. రేణు దేశాయ్
9. గుత్తా జ్వాల
10. మనోజ్ నందన్
11. జబర్దస్త్ పొట్టి రమేష్
12. కొరియోగ్రాఫర్ రఘు
13. బిత్తిర సత్తి
14. కామన్‌మెన్
15. కామన్ ఉమెన్

ఇంతకీ ఈ 15 మందిలిస్ట్‌లో ఫైనల్ అయ్యేది ఎవరు? బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ చేసేదెవరు? ఇంతకీ సీజన్ 3 ఎప్పుడు ప్రారంభం కానుంది తదితర విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.