HomeTelugu Trending'ఆహా' లో సైకలాజికల్‌ థ్రిల్లర్‌.. ట్రైలర్‌ రిలీజ్‌

‘ఆహా’ లో సైకలాజికల్‌ థ్రిల్లర్‌.. ట్రైలర్‌ రిలీజ్‌

Trance malayalam movie dubb
మలయాళ హీరో ఫాహద్‌ ఫాజిల్‌ హీరోగా తెరకెక్కిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘ట్రాన్స్‌’. ఈ ఏడాది ఫిబ్రవరిలో మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కరోనా కారణంగా థియేటర్‌లలో సినిమాల విడుదల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విడుదలకు నోచుకోని పలు చిత్రాలతో పాటు, ఇతర భాషల్లోని చిత్రాలను తెలుగులోకి అనువదిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రాన్ని తెలుగు ఓటీటీ ‘ఆహా’లో విడుదల చేస్తున్నారు. ఆగస్టు 7న ‘ట్రాన్స్‌’ స్ట్రీమింగ్‌ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్‌, నటుడు గౌతమ్‌ మేనన్‌ ‘ట్రాన్స్‌’ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. నజ్రియా నజీమ్‌, గౌతమ్‌ మేనన్‌, చంబన్‌ వినోద్‌ జోసీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్వర్‌ రషీద్‌ దర్శకత్వం వహించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu