‘పెట్ట’లో త్రిష లుక్‌.. పల్లెటూరి గృహిణిగా ఆకట్టుకుంది.

సూపర్‌స్టార్ రజనీ‌కాంత్‌తో కలిసి నటించాలన్న కల నెరవేరిందని నటి త్రిష సంబరపడుతున్నారు. తలైవా హీరోగా నటిస్తున్న సినిమా ‘పెట్ట’. ఈ సినిమాలో త్రిష, సిమ్రన్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇందులో సిమ్రన్‌ లుక్‌ను ఇటీవల విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా త్రిష పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో త్రిష పల్లెటూరి గృహిణిగా కనిపించారు. ఆమెను రజనీ ఎంతో సంతోషంతో ఊయల ఊపుతున్నారు. ఈ పోస్టర్‌ అభిమానుల్ని ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా త్రిష సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘నా కల నిజమైంది. ఒకే ఒక్క సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు జంటగా నటించాను. చాలా సంతోషంగా, గర్వంగా ఉంది..’ అని ఆమె పేర్కొన్నారు. ఈ సినిమాలో త్రిష ‘సారో’ పాత్రను పోషిస్తున్నట్లు మూవీయూనిట్‌ తెలిపింది.

కార్తీక్‌ సుబ్బరాజు ‘పెట్ట’కు దర్శకత్వం వహిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. విజయ్‌సేతుపతి, బాబిసింహా, శశికుమార్‌, సీనియర్‌ దర్శకుడు మహేంద్రన్‌ వంటి పెద్ద తారాగణంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రజనీకాంత్‌ కళాశాల వార్డెన్‌గా, ఫ్లాష్‌బ్యాక్‌లో సైనిక అధికారిగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఇటీవల ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ఇప్పటి వరకు విడుదల చేసిన ‘పెట్ట’ రెండు పాటలకు మంచి స్పందన లభించింది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates