ఏపీ మంత్రులు వీరే!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కనుందో దాదాపు ఖాయమైంది. మంత్రివర్గ కూర్పుపై ఇప్పటికే స్పష్టత ఇచ్చిన సీఎం జగన్‌.. ఏ అంశాల ప్రాతిపదికన మంత్రులను నియమిస్తున్నది పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఒకే సారి 25 మందితో పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. మంత్రివర్గంలోకి తీసుకునే వారికి ఇప్పటికే వైసీపీ అధిష్ఠానం నుంచి ఫోన్‌ ద్వారా సమాచారం అందుతోంది.

దాదాపు ఖరారైన మంత్రుల పేర్లు ఇవే:

ధర్మాన కృష్ణదాస్‌ (శ్రీకాకుళం)
బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (కర్నూలు)
బొత్స సత్యనారాయణ (విజయనగరం)
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (చిత్తూరు)
మేకతోటి సుచరిత (గుంటూరు)
మేకపాటి గౌతంరెడ్డి (నెల్లూరు)
కొడాలి నాని (కృష్ణా జిల్లా)
కొలుసు పార్థసారధి ( కృష్ణా జిల్లా)