HomeTelugu Trendingచిరంజీవిని ప్రమోట్ చేస్తున్న త్రివిక్రమ్‌

చిరంజీవిని ప్రమోట్ చేస్తున్న త్రివిక్రమ్‌

10 4త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆయన సినిమాలతో పనిలేకుండా అందరితో కలిసిపోతాడు. అందుకే ఇండస్ట్రీలో అందరివాడుగా.. గురుజీగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ డైరెక్టర్‌ అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురంలో’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్ తో ఆకట్టుకున్న త్రివిక్రమ్‌.. సినిమాను కూడా అదే రేంజ్ లో తీయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు.

ఇక ఇదిలా ఉంటె, త్రివిక్రమ్ శ్రీనివాస్ మెగాస్టార్ చిరంజీవి సైరాను ప్రమోట్ చేసేందుకు సిద్ధం అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లను త్రివిక్రమ్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూను రికార్డ్ చేసి రేపు దసరా రోజున అన్ని ఛానళ్లలో ప్రసారం చేయబోతున్నారు. సినిమా గురించిన అనేక ఆసక్తికర విషయాలను మెగాస్టార్, రామ్ చరణ్ లు ప్రేక్షకులతో పంచుకోబోతున్నారు. మొదటిసారి త్రివిక్రమ్ యాంకర్ గా మారి ఇంటర్వ్యూ చేయడం విశేషం. మెగాస్టార్ 153 వ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu