HomeTelugu Trendingఅల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ కాంబో రిపీట్

అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ కాంబో రిపీట్

Trivikram Fourth movie with

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ – డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ – ప్రొడ్యూసర్ రాధాకృష్ణ (చినబాబు) కాంబోలో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ‘జులాయి’ సినిమాతో మొదటిసారి కలిసిన వీరు ముగ్గురు.. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తో మరో విజయం అందుకున్నారు. అలానే గతేడాది ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్షేషనల్ హిట్ తో రికార్డ్స్ క్రియేట్ చేశారు. ఈ క్రమంలో సూపర్ హిట్ కాంబోలో నాలుగో సినిమా రాబోతోందని హింట్ వచ్చింది.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియా వేదికగా త్వరలోనే ఓ సర్ప్రైజ్ రాబోతోందని తాజాగా వెల్లడించారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ – అల్లు అర్జున్ – సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ లతో కలిసి ఉన్న ఓ ఫొటోని షేర్ చేశారు నాగవంశీ. ‘వరుడు కావలెను’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఈ ఫోటో తీసుకున్నట్లు తెలుస్తోంది. సర్ప్రైజ్ అంటూ హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ ని ట్యాగ్ చేయడంతో ‘అల వైకుంఠపురములో’ కాంబోలో మళ్ళీ రిపీట్ కానుందని అందరూ ఫిక్స్ అయ్యారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu